తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన అమితాబ్ - amitab bachan losses 5 kg

తన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వదంతులను కొట్టిపారేశారు బిగ్​బీ అమితాబ్. ఏమి కాలేదని, ఐదు కిలోల బరువు మాత్రమే తగ్గానని తన బ్లాగ్​లో రాసుకొచ్చారు.

అమితాబ్

By

Published : Oct 25, 2019, 12:03 PM IST

ఇటీవలే హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్​ అయిన బాలీవుడ్ ప్రముఖ నటుడు బిగ్​ బీ అమితాబ్​.. తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు. ఐదు కిలోలు బరువు తగ్గానని, బ్లాగ్​ వేదికగా వెల్లడించారు. దీనిపై సంతోషంగా ఉన్నానని అన్నారు.

ఈ నెల 15న సాాధారణ​ చెకప్​ నిమిత్తం ముంబయిలోని నానావతి ఆసుపత్రిలో చేరారు బిగ్​బీ. అదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికి తెరదించుతూ, తను బాగానే ఉన్నానని స్పష్టం చేశారు.

"కొద్ది రోజులుగా నేను బరువు తగ్గానని వైద్యులు అన్నారు. అవును నిజంగానే అలా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నాపై ప్రేమ చూపించిన, నా ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ ధన్యవాదాలు"
-అమితాబ్ బచ్చన్​, బాలీవుడ్​ నటుడు

బిగ్​ బీ ఇంట దీపావళి హంగామా

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇంట్లోమరో రెండు రోజుల్లో దీపావళిని సందడిగా జరుపుకోనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి బిగ్​బీ.. పలువురు బాలీవుడ్ నటులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. షారుక్ ఖాన్​, అలియా భట్​, అజయ్​ దేవగణ్​, అక్షయ్​ కుమార్​, ట్వింకిల్​ కుమార్​, కరణ్​జోహార్​, సంజయ్​ దత్​ తదితరులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.

ఇవీ చూడండి.. దీపిక ద్రౌపదిగా 'మహాభారతం'...

ABOUT THE AUTHOR

...view details