తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లీజుకు అమితాబ్​ బంగ్లా.. నెలకు రూ. 19లక్షలు అద్దె! - ఎస్​బీఐ

ముంబయిలోని అమితాబ్​ బచ్చన్​(bachchan news latest) బంగ్లాలైన అమ్ము, వాట్స్​లోని కొంత భాగాన్ని స్టేట్​ బ్యాంకు లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 15ఏళ్లు లీజు గడువు అని సమాచారం.

Amitabh Bachchan leases space to State Bank!
Amitabh Bachchan leases space to State Bank!

By

Published : Oct 10, 2021, 6:27 PM IST

బాలీవుడ్ దిగ్గజ​ నటుడు అమితాబ్​ బచ్చన్​(bachchan news latest).. తన బంగ్లాల్లోని కొంత భాగాన్ని లీజుకు ఇచ్చినట్టు తెలుస్తోంది. ముంబయిలోని అమ్ము, వాట్స్​ బంగ్లాలకు సంబంధించిన కొంత భాగాన్ని స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాకు ఆయన లీజుకిచ్చినట్టు సమాచారం.

సంబంధిత వర్గాల ప్రకారం.. 15ఏళ్ల పాటు ఈ లీజు కొనసాగుతుంది. దీనిపై నెలకు రూ.18.9లక్షల రెంటు వస్తుంది. ఐదేళ్ల తర్వాత ఈ మొత్తం రూ. 23.6లక్షలకు, అక్కడి నుంచి ఐదేళ్లకు రూ. 29.53లక్షలకు చేరుతుంది.

గతంలో దీనిని సిటీ బ్యాంకుకు లీజుకిచ్చారు బచ్చన్​. 2017లో లీజు ముగియగా.. అనంతరం బ్యాంకు స్పందించలేదు. తాజాగా.. దీనిని స్టేట్ ​బ్యాంకు దక్కించుకుందని తెలుస్తోంది.

ఇదీ చూడండి:-రూ.5వేల జరిమానాతో అమితాబ్ కారు విడుదల!

ABOUT THE AUTHOR

...view details