బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు కరోనా సోకడం కలకలం రేపింది. ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టింది. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తూ బిగ్‌బీ నివాసాన్ని సీల్ చేసింది. ఈ విషయాన్నే సూచిస్తూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే అమితాబ్, అభిషేక్‌కు వైరస్ సోకినట్లు నిర్ధరణ అయిన తర్వాత వారి ఇంట్లోని మిగిలిన సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కానీ ఫలితాలు రావాల్సి ఉంది.
అంతకుముందు నానావతి ఆసుపత్రిలో చేరిన అమితాబ్.. తనకు వైద్యం అందిస్తున్న సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియోను విడుదలు చేశారు. తనపై వారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. త్వరలోనే ఈ పరిస్థితిని అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దేవాలయాలు మూసివేసినా సరే, వైద్యులు దేవుళ్ల రూపంలో వచ్చి ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారని బిగ్‌బీ పేర్కొన్నారు.