లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి వేరే రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కార్మికులకు అండగా నిలిచి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. ఇప్పటికే ఆకలితో అలమటిస్తోన్న వారికి ఆహార ప్యాకెట్లు అందజేస్తోన్న ఆయన.. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చేరుకోవాలనుకునే వలస కూలీల కోసం 10 బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సుల ద్వారా దాదాపు 300మంది తమ స్వస్థలాలకు చేరుకున్నారు.
వలస కూలీలకు చేయూతనిచ్చిన బిగ్‌బీ - వలస కూలీలు స్వస్థలాకు చేరేందుకు రంగంలో బిగ్‌బీ
లాక్‌డౌన్‌తో సొంతూళ్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరుకునేలా 10 బస్సులను ఏర్పాటు చేశారు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. ఇప్పటికే కార్మికుల ఆకలి తీర్చెేందుకు ఆహార ప్యాకెట్లను అందిస్తున్నారు బిగ్‌బీ.
బిగ్‌బీ
ఇప్పటికే ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేసేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఓ టోల్ ఫ్రీ నెంబరును కూడా ప్రారంభించారు. మిగతా అన్ని పరిశ్రమల సినీ సెలబ్రిటీలూ తమ వంతు సాయంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కరోనా బాధితులకు అండగా నిలుస్తున్నారు.
ఇదీ చూడండి : సల్మాన్‌తో ఉన్న బంధంపై మాట్లాడిన హీరోయిన్!