దేశవ్యాప్తంగా కరోనా తాండవిస్తున్న వేళ ఎంతోమంది ప్రముఖులు తమ వంతుగా సాయన్ని అందించేందుకు ముందుకొస్తున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేరారు. దిల్లీలోని రాకబ్ గంజ్ గురుద్వారాను కరోనా సంరక్షణా కేంద్రంగా మార్చిన సందర్భంగా.. ఏర్పాట్ల కోసం రూ.2 కోట్లను విరాళంగా ప్రకటించారు అమితాబ్. ఈ విషయాన్ని ఆ గురుద్వారా నిర్వాహాక అధ్యక్షుడు మజిందర్ సింగ్ వెల్లడించారు.
కరోనా సంరక్షణ కేంద్రానికి అమితాబ్ రూ.2 కోట్ల సాయం
కరోనాపై పోరాటంలో తన వంతు సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. దిల్లీలోని రాకబ్ గంజ్ గురుద్వారాను కరోనా సంరక్షణ కేంద్రంగా మార్చిన నేపథ్యంలో దానికి రూ.2 కోట్లను విరాళంగా ప్రకటించారు. త్వరలోనే ఆక్సిజన్ కాన్సట్రేటర్లను అందుబాటులో తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు.
రాకబ్గంజ్లో ఏర్పాటు చేసిన కరోనా సంరక్షణ కేంద్రం సోమవారం ప్రారంభంకానుంది. 300 పడకలతో ఇందులో ఏర్పాటు చేశారు. దిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అమితాబ్ తనకు ప్రతిరోజూ ఫోన్ చేసి పరిస్థితుల గురించి తెలుసుకునేవారని నిర్వాహకుడు మజిందర్ తెలిపారు. అలాగే కొవిడ్ కేంద్ర నిర్మాణ పనుల గురించి అడిగేవారని పేర్కొన్నారు. త్వరలోనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులోకి తీసుకొస్తానని అమితాబ్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
ఇదీ చూడండి:అందాల రాక్షసివే.. గుండెల్లో గుచ్చావే!