తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలోనే కరోనా రహిత దేశంగా భారత్​!: బిగ్​బీ - వాక్సినేషన్​పై అమితాబ్​ స్పందన

దేశవ్యాప్తంగా శనివారం ప్రారంభమైన కొవిడ్​ వాక్సినేషన్​పై బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ స్పందించారు. గతంలో భారత్​ పోలియో వ్యాధిని నిర్మూలించిన విధంగా.. ఈ టీకాలతో భారత్​ కరోనా వైరస్​ రహితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Amitabh Bachchan expresses pride as India begins COVID-19 vaccination
త్వరలోనే కరోనా రహిత దేశంగా భారత్​: బిగ్​బీ

By

Published : Jan 17, 2021, 1:12 PM IST

ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్​ వాక్సినేషన్​ భారత్​లో నిర్వహించడం చాలా సంతోషాన్నిచ్చిందని బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ అన్నారు. ఈ వాక్సినేషన్​ ద్వారా దేశం కరోనా రహితంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"భారతదేశాన్ని పోలియో రహితంగా చేసినప్పుడు గర్వించాం. అదే విధంగా ఈ వాక్సినేషన్​ ద్వారా కొవిడ్​ను నిర్మూలించిన తర్వాత మరోసారి గర్వంగా భావిస్తాం. జై హింద్​".

- అమితాబ్​ బచ్చన్​, బాలీవుడ్​ మెగాస్టార్​

దేశవాప్తంగా కొవిడ్​ వాక్సినేషన్​ను శనివారం (జనవరి 16) ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. టీకాను తొలి దశలో ఫ్రంట్​లైన్​ వర్కర్లకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఆక్స్​ఫర్డ్​-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్ సంస్థ తయారు చేసిన కొవిషీల్డ్​తో పాటు దేశీయంగా భారత్ బయోటెక్​ రూపొందించిన కొవాగ్జిన్​ టీకాలను అందిస్తున్నారు.

ఇదీ చూడండి:బాలీవుడ్​ 'జెర్సీ' విడుదల తేదీ ఖరారు

ABOUT THE AUTHOR

...view details