కరోనా ప్రభావంతో ప్రతిఒక్కరూ మాస్క్లు ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే 'మాస్క్' అనే పదాన్ని మీ ప్రాంతీయ భాషల్లో ఏమంటారో తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఆ ప్రయత్నంలో ఉండండి. ఎందుకంటే బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్.. హిందీలో ఆ పదం అనువాదాన్ని కనిపెట్టేశారు. ఎట్టకేలకు దీని గురించి తెలుసుకున్నానని ఆనందపడుతూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
" దొరికింది.. దొరికింది... చాలా శ్రమ తర్వాత హిందీలో 'మాస్క్' అనువాదం దొరికింది. నాసికా ముఖ్ సంరక్షక్ కీటనిరోధక్ వాయుఛానక్ వస్త్రదోరియుక్త్ పట్టిక(ముక్కు, ముఖాన్ని క్రిముల నుంచి సంరక్షిస్తూ.. గాలిని శుద్ధి చేసేందుకు ధరించే పట్టీ)" అని అమితాబ్ రాసుకొచ్చారు.