నాలుగు రోజుల క్రితం ముంబయి నానావతి ఆసుపత్రిలో చేరిన నటుడు అమితాబ్ బచ్చన్.. శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. రాత్రి పది గంటలకు భార్య జయా బచ్చన్, కుమారుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి ఇంటికి వెళ్లారు. సాధారణ చెకప్ కోసమే చేరినట్లు తెలుస్తోంది.
కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని అందుకే బిగ్‌బీ ఆసుపత్రికి వెళ్లారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.