బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తనయుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వీరు ముంబయిలోని నానావతి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నారు. వీరి ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా అమితాబ్, అభిషేక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి .
"ప్రస్తుతం అమితాబ్, అభిషేక్ ఐసోలేషన్ వార్డులో ఉన్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. వారికి కరోనా ప్రత్యేక చికిత్స అవసరం లేదు. ప్రైమరీ మెడిసిన్‌తో బాగానే కోలుకుంటున్నారు."