తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బిగ్​బీకి కరోనా టీకా రెండో డోసు - అమితాబ్​ బచ్చన్​

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ కరోనా వ్యాక్సిన్​ రెండో డోసు స్వీకరించారు. ఇన్​స్టాలో దీనికి సంబంధించిన ఫొటోను పోస్ట్​ చేశారు.

Amitab Bachan
బిగ్​బీకి కరోనా టీకా

By

Published : May 16, 2021, 9:53 AM IST

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని బిగ్​బీ ఇన్​స్టా ద్వారా తెలిపారు. 'రెండో డోస్​ కూడా తీసేసుకున్నాను' అని వ్యాఖ్య రాసుకొచ్చారు.

గతేడాది అమితాబ్​తో పాటు అభిషేక్, ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్​ వచ్చింది. తర్వాత వీరంతా కోలుకుని షూటింగ్​లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం 'బ్రహ్మస్త్ర', 'బటర్​ఫ్లై', 'మేడే', 'గుడ్​బై' సహా పలు చిత్రాల్లో బిగ్​బీ నటిస్తున్నారు. ఇప్పటికే బిగ్​బీ ఫ్యామిలీ సహా సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, షర్మిలా ఠాగూర్, ధర్మేంద్ర, హేమా మాలిని, మోహన్ ​లాల్, జితేంద్ర, కమల్ హాసన్, నాగార్జున, రోహిత్ శెట్టి, నీనా గుప్తా, రాకేశ్ రోషన్, జానీ లీవర్​ ఇంకా పలువురు నటులు కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details