తన చిత్రాలతో ఎందరో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఇప్పటికీ యువ హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ స్ఫూర్తినిస్తున్నారు. అయితే నేడు అమితాబ్, జయా బచ్చన్ల 48వ పెళ్లిరోజు. ఈ నేపథ్యంలో ఓ అరుదైన ఫొటో షేర్ చేశారు బిగ్‌బీ. 'పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.
బిగ్‌బీ పెళ్లిరోజు.. అరుదైన ఫొటో షేర్ - అరుదైన ఫొటో షేర్ చేసిన బిగ్‌బీ
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో అరుదైన ఫొటో షేర్ చేశారు. తన వివాహబంధానికి 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు.
అమితాబ్
అమితాబ్ ప్రస్తుతం 'చెహ్రే', 'జుంద్', 'బ్రహ్మాస్త్ర', 'గుడ్‌బై', 'మేడే' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 'గుడ్‌బై' చిత్రంలో రష్మిక మంధాన కీలక పాత్ర పోషిస్తోంది.