అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మి కలిసి తొలిసారిగా నటిస్తున్న చిత్రం 'చెహ్రే'. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రూమీ జాఫరీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కరోనా కేసులు పెరగడం, థియేటర్లకు కొత్త మార్గదర్శకాలు జారీ చేయడమే ఇందుకు కారణమని తెలిపింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను ప్రకటిస్తామని వెల్లడించింది.
అమితాబ్ 'చెహ్రే' విడుదల తేదీ వాయిదా - amitab bachan movie postpone
బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో నటించిన 'చెహ్రే' సినిమా విడుదల తేదీని వాయిదా వేసింది చిత్రబృందం. కరోనా ఉద్ధృతి కొనసాగుతుండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.
చెహ్రే
'చెహ్రే' చిత్రంలో అమితాబ్ బచ్చన్ న్యాయవాది వీర్ పాత్రలో నటిస్తుండగా, ఇమ్రాన్ వ్యాపారవేత్త కరణ్ ఒబెరాయ్‌గా కనిపించనున్నారు. క్రిస్టల్ డిసౌజా, రియా చక్రవర్తి, సిద్ధాంత్ కపూర్, రఘువీర్ యాదవ్ ఇతర పాత్రల్లో నటించారు.
ఇదీ చూడండి: 'ఆయనతో కలిసి నటించాలనే నా కల నిజమైంది'