బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ నటించిన ఉత్తమ చిత్రాల్లో 'త్రీ ఇడియట్స్' ముందు వరుసలో ఉంటుంది. అందులో సీనియర్ విద్యార్థులు జూనియర్లను హాస్టల్లో బట్టలిప్పించి ర్యాగింగ్ చేసే సీన్ పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది. ఆ సీన్‌ను చిత్రీకరించేటప్పుడు నటులకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యింది.
అమ్మాయిల ముందు అండర్‌వేర్‌తోనా! - త్రీ ఇడియడ్స్ ర్యాగింగ్ సీన్
బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ నటించిన 'త్రీ ఇడియట్స్' చిత్రంలోని ఓ సన్నివేశంలో సీనియర్లు, జూనియర్లను బట్టలిప్పించి ర్యాగింగ్ చేసే సీన్ ఉంటుంది. ఈ సీన్‌ను చిత్రీకరించే సమయంలో నటులకు ఓ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందట.
బెంగళూరులోని ఐఐఎమ్ క్యాంపస్ గర్ల్స్ హాస్టల్లో ఆ సన్నివేశాన్ని తెరకెక్కించారు. షూటింగ్ జరిగేటప్పుడు ఆ హాస్టల్‌లో ఉండే అమ్మాయిలు ఆసక్తి కొద్ది అక్కడ గుమిగూడారు. ఎదురుగా అంత మంది అమ్మాయిలు.. సీన్ కోసమేమో బట్టలిప్పి కేవలం అండర్ వేర్‌తోనే ఉండాలి.. అంతేనా పిరుదులపై స్టాంపు కూడా వేయించుకోవాలి.. ఇక చూస్కోండి వారి పరిస్థితి ఎలా ఉంటుందో. అసలే సిగ్గుతో చచ్చిపోతుంటే దానికి తోడు టేకుల మీద టేకులు చేయాల్సి వచ్చింది. ఎప్పుడు సీన్ ఓకే అవుతుంది దేవుడా అని మొక్కుకున్నంత పనయింది. అంత ఇబ్బంది పడ్డా తెర మీద మాత్రం మంచి వినోదాలు పంచారు.