స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి నటించిన చిత్రం 'సైరా.' సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. చిరు నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు రాజమౌళి, మహేశ్ బాబు, సల్మాన్ వంటివారు 'సైరా' ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ చేరాడు. ట్విట్టర్ వేదికగా 'సైరా' ట్రైలర్ బాగుందని, సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూసున్నానంటూ ట్వీట్ చేశాడు. తాను చిరంజీవికి పెద్ద అభిమాని అని తెలిపాడు.