టాలీవుడ్‌లో దర్శకేంద్రుడిగా పేరొందిన రాఘవేంద్రరావు సినిమాల్లోనే ప్రత్యేకమైంది 'పెళ్లి సందడి'. శ్రీకాంత్, రవళి నటీనటులుగా తెరకెక్కిన ఈ చిత్రంలో దీప్తి భట్నాకర్ మరో కథానాయిక. శ్రీకాంత్ దీప్తిని ప్రేమిస్తే.. రవళి శ్రీకాంత్‌ను ఇష్టపడుతుంది. ఇలాంటి విచిత్రమైన ప్రేమకథను వెండితెరపై చక్కగా ఆవిష్కరించారు రాఘవేంద్రరావు.
దర్శకేంద్రుడి సినిమాకు ఆమిర్‌ఖాన్ క్లాప్ - amir khan clap to raghavendra rao movie
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిత్రాల్లో 'పెళ్లి సందడి' ఓ క్లాసిక్‌గా చెప్పుకోవచ్చు. అయితే ఈ చిత్రం మొదటి షాట్‌కు క్లాప్‌నిచ్చింది బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కావడం విశేషం.

శ్రీకాంత్ పెళ్లి చేసేందుకు హాస్యనటుల బృందమంతా సహాయం చేసే సమయంలో వాళ్లు చేసే ‘సందడి’ అంతా ఇంతా కాదు కదా. ఇంత సందడి చేసిన ఈ సినిమా చిత్రీకరణ కూడా ప్రత్యేకమే. ఎందుకంటే? సాధారణంగా సినిమాల్లో మొదటి షాట్ ఏదైనా సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఈ చిత్రాన్ని మాత్రం ఓ పాటతో ప్రారంభించారు. అంతేకాదు ఆ పాటలో హీరోయిన్ రవళి అభినయం చూసిన తర్వాతే ఆమెను ఆ ప్రాజెక్టులో ఉంచాలా, వద్దా? అని నిర్ణయానికి వచ్చారట. ఆ పాటే.. 'సరిగమపదనిస రాగం.. త్వరపడుతున్నది మాఘం'. ఈ పాటకే ఆమిర్ ఖాన్ క్లాప్‌నిచ్చింది. ఆయన తన సినిమా షూటింగ్‌కు హైదరాబాద్ వచ్చారు. ఇది తెలుసుకున్న రాఘవేంద్రరావు ఆయన్ను ఆహ్వానించగా.. ఆమిర్ వచ్చి ఫస్ట్ షాట్‌కు క్లాప్ ఇచ్చాడు.
ఇవీ చూడండి.. దడపుట్టిస్తోన్న విజయ్ 'విజిల్' ట్రైలర్