సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి విజయం అందుకుంది. త్వరలోనే డిజిటల్ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి సన్‌నెక్ట్స్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో 'ఆమీగో' ఫుల్ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్రబృందం.
'ఏ1 ఎక్స్‌ప్రెస్' నుంచి 'ఆమీగో' ఫుల్ సాంగ్ - సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఏ1 ఎక్స్‌ప్రెస్'. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. త్వరలోనే ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని 'ఆమీగో' పాటను విడుదల చేసింది చిత్రబృందం.
!['ఏ1 ఎక్స్‌ప్రెస్' నుంచి 'ఆమీగో' ఫుల్ సాంగ్ A1 express](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11594819-719-11594819-1619788796206.jpg)
ఏ1 ఎక్స్‌ప్రెస్
ఇందులో సందీప్, లావణ్య హావభావాలు, పాట మధ్యలో వినిపించే వీళ్ల మాటలు ఆకట్టుకుంటున్నాయి. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటని ఇన్నో జెంగా ఆలపించారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు. హాకీ నేపథ్యంలో దర్శకుడు జీవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయాపన్నెన్ నిర్మించారు.
Last Updated : Apr 30, 2021, 7:55 PM IST