అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన సినిమా 'ఏబీసీడీ'. ఇందులోని 'అమెరికా నా అమెరికా' అంటూ సాగే లిరికల్ గీతం తాజాగా విడుదలైంది. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా నటించింది. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. మాస్టర్ భరత్ సహాయ పాత్రలో కనిపించనున్నాడు.
'అమెరికా... నిన్ను నేను మిస్సవుతున్నా..'
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఏబీసీడీ' సినిమాలోని 'అమెరికా నా అమెరికా' లిరికల్ పాట విడుదలైంది. మే 17న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
'ఏబీసీడీ' సినిమాలోని 'అమెరికా నా అమెరికా' లిరికల్ పాట
మలయాళంలో తెరకెక్కిన 'ఏబీసీడీ' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులోనూ రీమేక్ చేశారు. అమెరికాలో పుట్టి భారతదేశానికి వచ్చిన హీరో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడో ఈ పాటలో ఫన్నీగా చూపించారు. వేసవి కానుకగా మే 17న వస్తోందీ చిత్రం.
ఇది చదవండి: భారీ నుంచి బార్బీ బొమ్మలా...