తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాంగ్ షూటింగ్​లో పాప్ సింగర్​ను కరిచిన పాము - మేటా స్నేక్ వీడియో

Snake bite: ఆల్బమ్ సాంగ్​ చిత్రీకరణలో భాగంగా ఓ పాప్​ సింగర్​ను పాము కాటేసింది. ఆ వీడియోను ఆమెనే ట్వీట్ చేయడం విశేషం.

American pop singer Maeta
పాప్ సింగర్ మేటా

By

Published : Dec 27, 2021, 4:47 PM IST

Maeta snack video: బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​ను పాము కరిచిన క్రమంలో అమెరికన్ పాప్ సింగర్​ మేటాను ఇటీవల పాము కాటేసిన వీడియో వైరల్​గా మారింది. అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసింది.

డిసెంబరు 20న ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్​లో భాగంగా మేటా పామును పట్టుకుని పోజులిచ్చింది. అయితే ఆ పాము ఆమె గడ్డం భాగంలో కరిచింది. అందుకు సంబంధించిన వీడియోను ఆమెనే ట్వీట్ చేసి.. 'నెవర్ ఎగైన్' అంటూ రాసుకొచ్చింది.

కొన్నిరోజులుగా హీరో సల్మాన్‌ తన కుటుంబానికి దూరంగా పాన్వేల్‌లోని ఫాంహౌస్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున ఆయన్ను పాము కరిచింది. దీంతో, సల్మాన్‌ వ్యక్తిగత సిబ్బంది వెంటనే ఆయనను ముంబయిలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. విషం లేని పాము కాటువేయడం వల్ల ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details