తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వకీల్​సాబ్' ముందే రిలీజ్.. నిర్మాతకు భారీ మొత్తం? - vakeelsaab pawan dil raju

అనుకున్న తేదీ కంటే ముందే 'వకీల్​సాబ్'ను విడుదల చేసుకునేందుకు అమెజాన్ ప్రైమ్ సంస్థ, నిర్మాతకు భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

Vakeel Saab's early release
పవన్ వకీల్​సాబ్

By

Published : Apr 30, 2021, 8:37 AM IST

Updated : Apr 30, 2021, 10:35 AM IST

ఓటీటీలో 'వకీల్​సాబ్' సందడి చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే అనుకున్న సమయం కంటే ముందు అందుబాటులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

వకీల్​సాబ్ సినిమాలో పవన్, శ్రుతిహాసన్

ఇంతకీ ఏం జరిగింది?

ఏప్రిల్ 9న 'వకీల్​సాబ్' థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమా త్వరలో ఓటీటీలో రిలీజ్​ చేస్తారనే వార్తలు వినిపించిన నేపథ్యంలో నిర్మాత దిల్​రాజు అప్పుడే స్పందించారు. రిలీజైన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి పెడతామని చెప్పారు. కానీ ఇప్పుడు మూడు వారాలైనా కాకముందే నెటిజన్లకు అందుబాటులోకి వచ్చింది.

అయితే చెప్పిన తేదీ కంటే ముందు రిలీజ్​ చేసుకునేందుకు అమెజాన్ ప్రైమ్.. నిర్మాత దిల్​రాజుకు దాదాపు రూ.12 కోట్లు అదనంగా చెల్లించనట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

ఇది చదవండి: రివ్యూ: పవన్ 'వకీల్​సాబ్ 'ఎలా ఉందంటే?

Last Updated : Apr 30, 2021, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details