తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అన్​ఫినిష్డ్​' సిద్ధంగా ఉంది: ప్రియాంకా చోప్రా - ప్రియాంకా చోప్రా జ్ఞాపకం

తన జీవితంలోని కొన్ని సంఘటనలతో ఓ అద్భుతమైన పుస్తకాన్ని ముద్రిస్తున్నట్లు ప్రకటించింది నటి ప్రియాంకా చోప్రా. దాని ప్రచురణ ప్రస్తుతం పూర్తికావస్తోందని.. త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ఆమె వెల్లడించింది.

'Amazing feeling', says Priyanka Chopra on seeing printed pages of her memoir Unfinished...https://aajtak.intoday.in/story/priyanka-chopra-shares-her-biography-unfinished-first-glimps-out-tmov-1-1220592.html
'అన్​ఫినిష్డ్​' సిద్ధంగా ఉంది: ప్రియాంకా చోప్రా

By

Published : Aug 18, 2020, 1:21 PM IST

'అన్​ఫినిష్డ్​' అనే పేరుతో.. తన జీవితంలోని కొన్ని జ్ఞాపకాలను ఓ పుస్తకం రూపంలో ముద్రించనుంది బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం దాని ప్రచురణ పూర్తయిందని.. త్వరలోనే విడుదల కానుందని ఆమె సోషల్​మీడియాలో ప్రకటించింది.

"నా పుస్తకం పూర్తయింది. మొదటిసారిగా నా జ్ఞాపకాలను పేజీలపై ముద్రించడం ఎంతో అద్భుతమైన అనుభూతినిచ్చింది. అన్​ఫినిష్డ్​ త్వరలోనే విడుదలవుతుంది".

- ప్రియాంక చోప్రా, బాలీవుడ్​ నటి

తన జీవితంలోని కొన్ని సంఘటనలతో కలిపి ఓ జ్ఞాపకాన్ని విడుదల చేయనున్నట్లు 2018 జూన్​లో​నే ప్రకటించింది నటి ప్రియాంక. దాన్ని చూసిన వారు వర్ణించలేని అనుభూతిని పొందుతారని తెలిపింది. నటి, నిర్మాత, గాయనిగానే కాకుండా యునిసెఫ్​ గుడ్​విల్​ అంబాసిడర్​గా ప్రియాంక కెరీర్​ సాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details