తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సింగర్​తో అమలాపాల్​ ప్రేమాయణం! - AMALA PAUL LOVE WITH SINGER

ప్రముఖ కథానాయిక అమలాపాల్​ ఓ గాయకుడితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ సింగర్​ ఎవరో తెలుసా?

Amala Paul in a live-in relationship with Mumbai based singer?
సింగర్​తో అమలాపాల్​ ప్రేమాయణం!

By

Published : Mar 11, 2020, 3:53 PM IST

ప్రముఖ సినీనటి అమలాపాల్​ మళ్లీ ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయికి చెందిన గాయకుడు భవ్​నీందర్​ సింగ్​తో ఈ అమ్మడు డేటింగ్​లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ యువ సింగర్​​ తన ఇన్​స్టాలో అమలాతో ఉన్న ఫొటోలను పోస్ట్​ చేశాడు. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

2014లో తమిళ దర్శకుడు విజయ్​ను పెళ్లిచేసుకుంది అమలాపాల్​. మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. 2017లో ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం విజయ్.. 'తలైవి' పేరుతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తీస్తున్నాడు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రధానపాత్రలో నటిస్తోంది. అమలా చివరిగా 'ఆమె' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం లస్ట్​స్టోరీస్​ తెలుగు రీమేక్​లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details