తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమలాపాల్​ మాజీ భర్తకు రెండో పెళ్లి - ABHINETRI

ప్రముఖ నటి అమలాపాల్‌ మాజీ భర్త, దర్శకుడు విజయ్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. వైద్యురాలు ఆర్‌. ఐశ్వర్యను గురువారం వివాహం చేసుకున్నాడు. చెన్నైలోని కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ శుభకార్యం జరిగింది. విజయ్‌ పెళ్లి ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అమలాపాల్​ మాజీ భర్తకు రెండో పెళ్లి

By

Published : Jul 12, 2019, 5:52 PM IST

తమిళ దర్శకుడు ఎ.ఎల్‌. విజయ్‌ రెండో వివాహం చేసుకున్నాడు. వైద్యురాలు ఆర్‌. ఐశ్వర్యను పరిణయమాడాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో చెన్నైలో గురువారం ఈ శుభకార్యం జరిగింది. జూన్‌ 29న విజయ్‌ తన రెండో పెళ్లికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేశాడు.

దర్శకుడు విజయ్ రెండో పెళ్లి ఫొటో

" ఆర్‌. ఐశ్వర్యను వివాహం చేసుకోబోతున్నానని తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. అత్యంత సన్నిహితుల సమక్షంలో మా పెళ్లి. మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమతో నా జీవితంలో కొత్త అధ్యయనాన్ని మొదలు పెట్టబోతున్నా. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం"
-- విజయ్​, తమిళ దర్శకుడు

2014లో విజయ్‌.. కథానాయిక అమలాపాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మూడేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరూ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. 2017లో విడాకుల తర్వాత విజయ్‌ తన మాజీ భార్య గురించి మీడియా ముందు మాట్లాడాడు.

" ఇద్దరి మధ్య నమ్మకం, నిజాయితీ కొరవడిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. నమ్మకంలేని బంధానికి విలువలేదు. అమలాపాల్‌తో విడిపోయే రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మరో దారిలేదు.. ఈ బాధను భరించాల్సిందే" -విజయ్‌

ప్రస్తుతం విజయ్.. తలైవి పేరుతో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తీస్తున్నాడు. బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఆమె పాత్రలో నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. అమలాపాల్ నటించిన 'ఆమె' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: 'ఆమె'లో నగ్నంగా నటించిన అమలాపాల్​

ABOUT THE AUTHOR

...view details