అప్పుడప్పుడు మాత్రమే కెమెరా ముందుకొస్తుంటుంది అమల అక్కినేని. పాత్రల విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంటుంది. ప్రస్తుతం శర్వానంద్, రీతూవర్మ జంటగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో అమల అక్కినేని నటిస్తోంది. శర్వానంద్‌కి తల్లిగా ఈ మాజీ హీరోయిన్ నటిస్తుండగా, తండ్రి పాత్రని రవి రాఘవేంద్ర పోషిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తండ్రి రవి రాఘవేంద్ర.
ప్రస్తుతం హైదరాబాద్‌లో శర్వానంద్, అమల, రవి రాఘవేంద్రలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు శ్రీకార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మాతలు.