తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2020, 7:07 AM IST

ETV Bharat / sitara

సంక్రాంతికి సందడి చేయనున్న 'అల్లుడు అదుర్స్​'

వచ్చే ఏడాది సంక్రాంతికి 'అల్లుడు అదుర్స్​' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆ చిత్రనిర్మాతలు తెలిపారు. లాక్​డౌన్​ తర్వాత సోమవారం ఈ సినిమా చిత్రీకరణ పునఃప్రారంభించిన సందర్భంగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలోనే టీజర్​ రిలీజ్​ చేయనున్నట్లు వెల్లడించింది చిత్రబృందం.

Alludu Adhurs Movie Shoot Resumes in Hyderabad
సంక్రాంతికి సందడి చేయనున్న 'అల్లుడు అదుర్స్​'

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ కథానాయకుడిగా సంతోష్​ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అల్లుడు అదుర్స్‌'. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లో పునః ప్రారంభమైంది. బెల్లంకొండ శ్రీనివాస్‌, ప్రకాష్‌రాజ్‌లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. "పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. త్వరలో టీజర్‌ రిలీజ్‌ చేస్తాం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని తెలిపారు.

'అల్లుడు అదుర్స్​' ఫస్ట్​లుక్​

ఈ సినిమాకు సుబ్రహ్మణ్యం గొర్రెల నిర్మాత. నభా నటేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కూర్పు: తమ్మిరాజు, కళ: అవినాష్‌ కొల్లా, యాక్షన్‌: రామ్‌ - లక్ష్మణ్‌, ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు.

ABOUT THE AUTHOR

...view details