ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప'. రష్మిక హీరోయిన్. ఇందులో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. ఈ పాత్రను పరిచయం చేస్తూ ఇటీవల ఓ స్పెషల్ వీడియో(టీజర్)ను విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పుడా వీడియో ఓ రికార్డును సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే యూట్యూబ్‌లో 50మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. కేవలం 20 రోజుల్లోనే ఈ మార్క్‌ను అందుకోవడం విశేషం.
రికార్డులతో దూసుకెళ్తున్న 'పుష్పరాజ్' - pushpa teaser
సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప' సినిమాలోని పుష్ప పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో వేగంగా 50 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది.
పుష్పరాజ్
అంతకుముందు 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి టీజర్‌గా రికార్డుకెక్కింది. అయితే దీనికి దాదాపు ఆరు నెలల సమయం పట్టింది.