తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' ట్రీట్​.. అల్లుఅర్జున్​ కొత్త లుక్​ అదుర్స్​ - anasuya upcoming movie

అల్లుఅర్జున్​, రష్మిక జంటగా నటిస్తున్న 'పుష్ప'(pushpa update) సినిమా నుంచి మరో కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాటను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులోని అల్లు అర్జున్​ కొత్త లుక్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.

pushpa
పుష్ప

By

Published : Nov 14, 2021, 10:14 AM IST

Updated : Nov 14, 2021, 10:34 AM IST

'పుష్ప'(pushpa allu arjun movie) సినిమా విడుదల తేదీ దగ్గర పడే కొద్ది చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్​లను వరుసగా ప్రకటిస్తూ ఫ్యాన్స్​లో జోష్​ నింపుతోంది చిత్రబృందం. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్​ ఇచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాట 'ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ'ను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులోని అల్లు అర్జున్​ కొత్త లుక్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. నుదుటన బొట్టు, ఒంటినిండా బంగారపు చైన్లు, ఉంగరాలతో కళ్లజోడు పెట్టుకుని సరికొత్త అవతారంలో కనిపించారు.

పుష్ప

భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కుతోన్న 'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సుకుమార్‌(sukumar alluarjun movie) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు(alluarjun rashmika movie). ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప ది రైజ్‌' పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లింప్స్​ ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.

పుష్ప

ఇదీ చూడండి: 'పుష్ప' అప్డేట్​.. ఊరమాస్​ లుక్​లో అనసూయ

Last Updated : Nov 14, 2021, 10:34 AM IST

ABOUT THE AUTHOR

...view details