గత కొద్ది రోజులుగా 'పుష్ప'(pushpa allu arjun movie) హిందీ వెర్షన్ విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. ఏఏఫిలిమ్స్ ఇండియా ద్వారా మూవీని రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది(pushpa movie hindi release date). అలాగే కర్ణాటకలో స్వాగత్ ఎంటర్‌ప్రైజస్ ద్వారా విడుదల కానున్నట్లు వెల్లడించింది. డిసెంబరు 17న అన్ని భాషల్లోనూ డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న 'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్(sukumar alluarjun movie) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బన్నీ పుష్పరాజ్ అనే ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు(alluarjun rashmika movie). ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 'పుష్ప ది రైజ్' పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లింప్స్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి.
ట్రైలర్
"అన్నయ్యా.. నేను ఉన్నంతవరకూ నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదు. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. దాని కోసం నేను ఏదైనా చేస్తాను. ఏమైనా దాటి వస్తాను" అని అంటున్నారు నటి అవికాగోర్. ఆమె, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రో'(naveen chandra bro movie). అన్నాచెల్లెల అనుబంధంపై తెరకెక్కిన కుటుంబకథా చిత్రమిది. కార్తిక్ తుపురాని దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 26న సోనీ లివ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది(naveen chandra bro movie release date). ఈ నేపథ్యంలో శనివారం(నవంబరు 20) విడుదలైన 'బ్రో' ట్రైలర్ ఆకట్టుకుంటోంది(naveen chandra bro movie trailer).