తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆలస్యంగా 'కేజీఎఫ్​ 2' .. 'పుష్ప' టీమ్​కు బన్నీ సూచనలు! - alluarjun pushpa 2

Alluarjun Pushpa 2, Yash KGF 2 cinema updates: కన్నడ స్టార్​ యశ్ నటించిన 'కేజీఎఫ్​ 2' మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, 'పుష్ప 2' విషయంలో చిత్రబృందానికి హీరో అల్లుఅర్జున్​ కొన్ని సూచనలు చేశారట.

Alluarjun Pushpa 2 Yash KGF  cinema updates
జీఎఫ్​ 2, పుష్ప అప్డేట్స్​

By

Published : Feb 20, 2022, 7:20 AM IST

YaSH KGF 2 Movie postpone: ప్రస్తుతం భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కేజీయఫ్‌ 2 ఒకటి. యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీయఫ్‌: చాప్టర్‌-1’కు కొనసాగింపుగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరోవైపు తమిళ నటుడు విజయ్ ‘బీస్ట్‌’, షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’ చిత్రాలు కూడా ఏప్రిల్‌ 14నే విడుదల చేస్తామని ఆయా చిత్ర బృందాలు తెలిపాయి. ఈ క్రమంలో బాక్సాఫీస్‌ వద్ద త్రిముఖ పోరు తప్పదని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో ఓ వార్త యశ్‌ అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ‘కేజీయఫ్‌2’ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తాజాగా కన్నడనాట టాక్‌ వినిపిస్తోంది.

ఇంతకీ ఏం జరిగిందటే..

‘కేజీయఫ్‌2’లో యశ్‌ ఇంట్రో సాంగ్‌ అనుకున్న స్థాయిలో రాలేదని దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ భావిస్తున్నారట. దీంతో ఆ సాంగ్‌ను మళ్లీ షూట్‌ చేద్దామనుకుంటున్నారట. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌లో 5 రోజుల పాటు షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాణానంతర కార్యక్రమాలు ఆలస్యమవుతాయని అంటున్నారు. అభిమానులు మాత్రం అనుకున్న తేదీకే సినిమా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఈ చిత్రం ప్రతినాయకుడు అధీర పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కనిపించనున్నారు. ఇటీవలే ఆయన తన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేశారు.

ఆ తప్పు మళ్లీ చేయొద్దంటూ

Alluarjun pushpa 2 movie update: 'పుష్ప' చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్‌ . సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ఉత్సాహంతో ‘పుష్ప2’ కోసం రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే రెండో భాగానికి సంబంధించిన పనులను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ పలు సూచనలు చేశారట. ముఖ్యంగా ‘పుష్ప: ది రైజ్’ షూట్‌ అనుకున్న దానికంటే ఆలస్యమైన సంగతి తెలిసిందే. దీని వల్ల అనుకున్న స్థాయిలో ప్రచారం కూడా చేయలేకపోయారు. ప్రీరిలీజ్‌ వేడుకకు దర్శకుడు సుకుమార్‌ సైతం హాజరు కాలేకపోయారు. ఈ సారి మాత్రం ఆ తప్పును మళ్లీ చేయొద్దని బన్నీ సూచించారట. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి, ప్రచార కార్యక్రమాలకు ఎక్కువ సమయం ఉండేలా చూసుకోవాలని చిత్ర బృందానికి చెప్పారట. అందుకు అనుగుణంగా షూటింగ్‌ షెడ్యూల్స్‌, ఇతర నటీనటుల డేట్స్‌ను లాక్‌ చేసే పనిలో ఉన్నారు.

ఇదీ చూడండి: బాత్​టబ్​ బ్యూటీస్.. ఆలియా నుంచి సన్నీ లియోనీ వరకు!

ABOUT THE AUTHOR

...view details