పుష్ప చిత్రంతో తనకు వచ్చిన క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్‌కే దక్కుతుందని అన్నారు హీరో అల్లుఅర్జున్. తన ఫ్యాన్స్‌ను గర్వించే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు. నేడు(మంగళవారం) తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మైదానంలో అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకను నిర్వహించింది చిత్రబృందం. ఈ వేడుకలోనే బన్నీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"నాకు వచ్చిన క్రెడిట్ అంతా సుకుమార్‌కే దక్కుతుంది. ఆయనతో పాటు నా సహ నటులందరికీ కూడా. రష్మికతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అదిరిపోయే ఆల్బమ్‌ను ఇచ్చిన దేవీశ్రీకి స్పెషల్ థ్యాంక్స్. నా ఫ్యాన్స్ అందరినీ గర్వించేస్థాయికి తీసుకెళ్తాను" అని అల్లుఅర్జున్ చెప్పారు.
"నన్ను విలన్ క్యారెక్టర్లో ఆదరించిన ప్రేక్షకులకు, సినిమాను సక్సెస్ చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరున థ్యాంక్స్. దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు." అని సునీల్ అన్నారు.
"సుకుమార్‌కు ధన్యవాదాలు. అల్లుఅర్జున్ నా లైఫ్‌లో చాలా ముఖ్యం. ఆయనది చాలా పెద్ద మనసు. అబ్బాయిలకే కాదు అమ్మాయిలకూ ఆయన స్ఫూర్తి. బన్నీ ట్రాన్స్ఫర్మేషన్ వర్ణణాతీతం. ఆయన ఇంత పెద్ద స్టార్ అవుతారని అసలు అనుకోలేదు. ఈ చిత్రంలో నేను భాగస్వామ్యం అవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. పార్ట్ 2లో నా పాత్ర ఇంకా బాగుంటుంది. నా గురువు దైవం సుకుమార్. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని మాటల్లో చెప్పలేను. రంగమ్మత్త, ద్రాక్షాయనిగా నన్ను చూపించినందుకు థ్యాంక్స్." అని అనసూయ పేర్కొన్నారు.