తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్యాప్​ చాటున బన్నీ న్యూలుక్​... నెట్టింట వైరల్​​ - గుబురు గడ్డం... ఒత్తైన జుట్టులో అల్లుఅర్జున్​ వైరల్​

గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో ఉన్న లుక్​లో అల్లు అర్జున్​ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో బన్నీ లుక్​ ఇదేనని నెటిజన్లు భావిస్తున్నారు.

Alluarjun
అల్లుఅర్డున్​

By

Published : Mar 14, 2020, 8:59 PM IST

Updated : Mar 14, 2020, 9:30 PM IST

సంక్రాంతికి 'అల వైకుంఠపురములో..' సినిమాతో హిట్‌ అందుకున్నాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. కేరళలో ఈ సినిమా షూటింగ్‌ జరగబోతోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో సాగే మాఫియా కథతో ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడని టాక్​. అయితే ఈ సినిమాలో అతడు కనిపించే లుక్​పై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్​హీరో ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేస్తున్నాయి.

శనివారం తన బాడీగార్డు పుట్టినరోజు వేడుక నిర్వహించాడు బన్నీ. ఈ సందర్భంగా వేడుకలో తీసిన ఫొటోల్లో గుబురు గడ్డంతో కనివిందు చేశాడు బన్నీ. అయితే హెయిర్​ స్టైల్​ కనిపించకుండా క్యాప్​తో కవర్​ చేశాడు. ఈ లుక్​ చూసిన నెటిజన్లంతా బన్నీ తన తర్వాత సినిమాలో ఇదే గెటప్​లో కనిపిస్తాడని భావిస్తున్నారు.

క్యాప్​ చాటున బన్నీ న్యూలుక్​... నెట్టింట వైరల్​​

'రంగస్థలం'లో చరణ్‌ కూడా ఇలాగే గుబురు గడ్డంతో సినిమా మొత్తం కనిపించడమే కాదు.. తన నటనతో మెస్మరైజ్‌ చేశాడు. సుక్కు మరోసారి ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నాడని టాలీవుడ్‌ టాక్.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నాడు. సుకుమార్- బన్నీలది క్రేజీ కాంబినేషన్‌. వీరిద్దరూ కలిసి 'ఆర్య', 'ఆర్య 2' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తన బాడిగార్డ్​ పుట్టినరోజు వేడుకలో అల్లు అర్జున్​
తన బాడీగార్డ్​ పుట్టినరోజు వేడుకలో అల్లు అర్జున్​

ఇదీ చూడండి : భార్యభర్తల్ని తల్లి కొడుకుల్ని చేసిన నెటిజన్

Last Updated : Mar 14, 2020, 9:30 PM IST

ABOUT THE AUTHOR

...view details