"కథానాయికగా(pushpaka vimanam 2021 cast) ఇలాంటి పాత్రలే చేయాలని నియమాలేం పెట్టుకోలేదు. కథ, నా పాత్ర మనసుకు నచ్చితే చాలు.. ఏతరహా పాత్రలోనైనా నటిస్తాను" అని చెప్పింది నటి శాన్వీ మేఘన. 'పిట్టకథలు', 'సైరా నరసింహారెడ్డి', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన తెలుగందం ఆమె. ఇప్పుడామె ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన చిత్రం 'పుష్పక విమానం'. దామోదర దర్శకుడు. గీత్ సైని మరో కథానాయిక(pushpaka vimanam 2021 heroine name). ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది(pushpaka vimanam 2021 release date). ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపింది శాన్వి. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
"ఇదొక కామెడీ థ్రిల్లర్. ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తుంది. అలాగే ఆసక్తిరేకెత్తించే మలుపులు ఉంటాయి. నేనిందులో ఓ షార్ట్‌ఫిల్మ్ హీరోయిన్‌గా కనిపిస్తాను. సినిమా ఆద్యంతం సందర్భానుసారంగా నా పాత్ర వస్తుంటుంది. దీంట్లో ఆనంద్‌తో నాకున్న బంధం ఏంటన్నది తెరపైనే చూడాలి. పాత 'పుష్పక విమానం'కు.. దీనికి టైటిల్ తప్ప మరే విషయంలోనూ పోలిక ఉండదు".
"సినిమాలో గీత్ సైనీ పాత్ర కనిపించకుండా పోయాక.. కథలో అనేక మలుపు లుంటాయి. అవేంటి? వాటి వల్ల మా పాత్రలన్నీ ఎలా కలిశాయి? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నాది కానీ.. ఆనంద్, గీత్‌ల పాత్రలు గానీ ఎక్కడా రెగ్యులర్ నాయకానాయికల పాత్రల్లా కనిపించవు. కథతో పాటు సహజంగా సాగిపోతుంటాయి. సినిమా చూసుకున్నాక.. నటిగా నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఆరోజు రాత్రంతా నిద్రపోలేదు".
"నేను హైదరాబాద్ అమ్మాయినే. పుట్టిపెరిగిందంతా ఇక్కడే. బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో డిగ్రీ చేశా. మా క్యాంపస్‌లో అప్పుడప్పుడు కొన్ని షూటింగ్స్ జరుగుతుండేవి. ఓసారి నాని సినిమా షూటింగ్ జరుగుతుంటే నేనూ వెళ్లా. అక్కడ నన్ను చూసి ఒకరు ఓ సీరియల్ ఆడిషన్‌కు పిలిచారు. ఇంట్లో వాళ్లకి నన్నీ రంగంలోకి పంపించడం ఇష్టం లేక వద్దన్నారు. తర్వాత ఓసారి జయసుధ మేడం ఓ టీవీ ప్రోగ్రాం కోసం ఇంట్లో వాళ్లతో మాట్లాడారు. అంత పెద్ద నటి పిలిచి అవకాశం ఇచ్చే సరికి.. అమ్మానాన్న అభ్యంతరం పెట్టలేదు. కానీ, ఆ షో మధ్యలో ఆగిపోయింది. తర్వాత 'బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్' అనే చిత్రంలో నాయికగా చేశా. అదయ్యాక 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో తమన్నా చెల్లిగా చేశా. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేసిన 'పిట్టకథలు'.. ఇటీవల వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' చిత్రాలతో పేరొచ్చింది. నటిగా నాకు శ్రీదేవి స్ఫూర్తి. హీరోల్లో అల్లు అర్జున్‌ను బాగా ఇష్టపడతా. నాకు డ్రీమ్ రోల్స్ ఏమీ లేవు కానీ, మంచి ప్రేమకథలో నటించాలనుంది".
ఇదీ చూడండి:నేను పడిన కష్టాలు మరొకరు పడకూడదనే: విజయ్ దేవరకొండ