తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ పాటను.. మహేశ్​ పాడేశారు! - అల్లు అర్డున్​తో సర్కారు వారి పాట

మహేశ్ ​బాబుతో ​తెరకెక్కిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమాను ముందుగా అల్లు అర్జున్​తో చేయాలనుకున్నారట దర్శకుడు పరశురామ్. కానీ బన్నీకి ఈ కథ నచ్చకపోవడం వల్ల మహేశ్​కు వినిపించారట. ఈ స్టోరీ బాగుండటం వల్ల అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు మహేశ్​.

Alluarjun in Sarkaru vari pata movie
బన్నీ సర్కార్​ పాటను.. మహేశ్​ పాడేశాడు

By

Published : Jun 1, 2020, 5:26 PM IST

అల్లు అర్జున్‌ వద్దనుకున్న వేలం పాటను మహేశ్​ బాబు పాడేశారా? అవుననే అంటున్నాయి చిత్ర సీమ వర్గాలు. తాజాగా మహేశ్‌ తన కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'ను అధికారికంగా ప్రకటించారు. పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వం నుంచి అనుమతులు దక్కగానే ఇది సెట్స్‌పైకి వెళ్లనుంది.

అయితే ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. పరశురామ్‌ ఈ కథకు తొలుత అనుకున్నది మహేశ్​‌ను కాదట. ఆయనకు మొదటి నుంచీ గీతా ఆర్ట్స్‌లో బన్నీ కథానాయకుడిగా ఓ చిత్రం చేయాలని బలమైన కోరిక. అందుకే ఆయన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కథను సిద్ధం చేశారట. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ స్క్రిప్ట్‌ బన్నీకి ఎందుకో నచ్చలేదని టాక్​. దీంతో ఇదే కథను మహేశ్​కు వినిపించగా గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. అలా స్టైలిష్‌ స్టార్‌ కోసం సిద్ధం చేసిన 'సర్కారు వారి పాట'ను సూపర్‌స్టార్‌ అందిపుచ్చుకున్నారని చిత్ర పరిశ్రమలో టాక్​.

ఇదీ చూడండి : 'అది ఫేక్​న్యూస్​.. చట్టపరమైన చర్యలు​ తీసుకుంటా'

ABOUT THE AUTHOR

...view details