తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ సినిమా రిలీజ్ ఆపేందుకు రూ.8కోట్లు ఖర్చు చేశారా?

Ala vikunthapuramulo hindi dubbed movie: ఐకాన్​స్టార్​ అల్లుఅర్జున్​ నటించిన ఓ సినిమా రిలీజ్​ కాకుండా ఆపేందుకు ఓ చిత్రబృందం రూ.8కోట్లు ఖర్చు చేసిందట! ఇంతకీ ఆ మూవీ ఏంటి? అంత మొత్తంలో ఎవరు, ఎందుకు ఖర్చు చేశారో తెలుసుకుందాం..

అల వైకుంఠపురములో హిందీ డబ్​, Ala vikunthapuramulo hindi dubbed
అల వైకుంఠపురములో హిందీ డబ్​

By

Published : Jan 13, 2022, 6:21 PM IST

Updated : Jan 13, 2022, 6:41 PM IST

Ala vikunthapuramulo hindi dubbed movie: ఐకాన్​ స్టార్​ అల్లుఅర్జున్​కు ఉన్న ఇమేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాదితో పాటు బాలీవుడ్​లోనూ ఆయనకు మంచి క్రేజ్​ ఉంది. అందుకే హిందీలో డబ్​ అయ్యే ఆయన సినిమాలు కూడా యూట్యూబ్​లో రికార్డ్​ వ్యూస్​తో దూసుకెళ్తుంటాయి. అయితే బన్నీ నటించిన ఓ మూవీ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆ సినిమా రిలీజ్​ కాకుండా ఆపేందుకు ఓ చిత్రబృందం ఏకంగా రూ.8కోట్లు ఖర్చుచేసిందట! ఒకవేళ రిలీజ్​ అయితే తమ సినిమా​పై ప్రభావం పడుతుందని ఈ పని చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని సినీవర్గానికి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. ఇంతకీ ఆ బన్నీ సినిమా ఏంటి? అది విడుదల కాకుండా ఆపేందుకు అంత మొత్తంలో ఖర్చు చేసింది ఎవరో తెలుసుకుందాం..

త్రివిక్రమ్​ దర్శకత్వంలో అల్లుఅర్జున్​ హీరోగా విడుదలైన 'అల వైకుంఠపురములో' ఎంతగా హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీలో బన్నీ మేనరిజం, పాటలు సినీప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సాంగ్స్​ విషయానికొస్తే యూట్యూబ్​లో రికార్డ్​లు సృష్టించాయి. దీంతో.. ఈ చిత్ర హిందీ డబ్బింగ్​ రైట్స్​ను గోల్డ్​ మైన్స్​ టెలిఫిల్మ్స్​ అధినేత మనీష్​ షా రూ.4కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే రోహిత్​ ధావన్ దర్శకత్వంలో కార్తిక్​ ఆర్యన్​, కృతిసనన్​తో 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్​ తెరకెక్కించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 'షెహజాదా' అనే టైటిల్​ను కూడా ఖరారు చేశారు.

" 'అల వైకుంఠపురములో' హిందీ డబ్​ను టీవీ, డిజిటల్​ ప్లాట్​ఫామ్​ వేదికగా గ్రాండ్​గా రిలీజ్​ చేద్దామని మనీష్​ సన్నాహాలు చేశారు. అంతలోనే అదే సినిమా హిందీ రీమేక్​ తెరకెక్కించనున్నట్లు తెలిసి కాస్త నిరాశకు గురయ్యారు. కానీ ఒప్పందం ప్రకారం తన సినిమా బయటకు వచ్చిన ఆరు నెలల తర్వాతే రీమేక్​ను విడుదల​ చేయాలి. దీంతో ఆయన తన మూవీని త్వరగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న 'షెహజాదా' చిత్రబృందం.. తమ రీమేక్​ కన్నా డబ్బింగ్​ ముందు వస్తే తమపై ప్రభావం పడే అవకాశం ఉందని గ్రహించి మనీష్​తో సంప్రదింపులు జరపడం ప్రారంభించింది. కో ప్రొడ్యూసర్​గా వ్యవహరించే ఆఫర్​ను కూడా ప్రకటించింది. కానీ మనీష్​ దాన్ని సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత పలు దఫాల చర్చల ద్వారా చివరికి రీమేక్​ను ముందు విడుదల చేసేలా మనీష్​తో రూ.8కోట్లకు డీల్​ కుదుర్చుకుంది. తమ చిత్రం థియేటర్లలో వచ్చిన 16వారాల తర్వాతే డబ్బింగ్​ను స్ట్రీమింగ్​ చేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మనీష్​కు​ రూ.4కోట్ల లాభం వచ్చింది." అని సదరు ప్రతినిధి తెలిపారు.

కాగా, అల్లుఅర్జున్​ ఇటీవలే సుకుమార్​ దర్శకత్వంలో 'పుష్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని అందుకున్నారు. బాలీవుడ్​లోనూ ఈ చిత్రం సూపర్​హిట్​గా నిలిచింది.

ఇదీ చూడండి:'బుట్టబొమ్మ' సాంగ్​కు అల్లు అర్హ-పూజాహెగ్డే స్టెప్పులు

Last Updated : Jan 13, 2022, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details