'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అల.. వైకుంఠపురములో' వంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్. తాజాగా ఈ జోడీ మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి సినిమా కోసం కాదు. వీరిద్దరూ ఒక యాడ్ కోసం పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ మెయిన్ లీడ్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ వాణిజ్య ప్రకటన తెరకెక్కుతోంది. ఆన్‌లైన్ కారు బుకింగ్ యాప్ ‘రాపిడో’ కోసం వీరిద్దరూ ఓ యాడ్ షూట్ చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఈ షూట్ ప్రారంభమైంది. ఇందులో బన్నీ ఊరమాస్ లుక్‌లో కనిపించారు. మరోవైపు ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'ఆహా' యాడ్ సూపర్‌హిట్టైంది.
మరో 'రూట్'లో అలరించనున్న త్రివిక్రమ్-బన్నీ! - త్రివిక్రమ్ అల్లుఅర్జున్ సినిమాలు ఎన్ని?
త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఓ పాత్రలో మెరవబోతున్నారు. ఇప్పటికే మూడు చిత్రాలకు కలసి పనిచేసి హ్యాట్రిక్ కొట్టిన త్రివిక్రమ్-బన్నీ ద్వయం.. మరోసారి అలరించనుంది. ఈ షూటింగ్ లోకేషన్ నుంచి విడుదలైన ఓ స్టిల్‌లో బన్నీ ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్నారు.
AlluArjun
'అల.. వైకుంఠపురములో' తర్వాత అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'పుష్ప'. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక సందడి చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సిద్ధమవుతోన్న ఈ చిత్రంలో బన్నీ.. పుష్పరాజ్‌గా కనిపించనున్నారు.
ఇవీ చదవండి: