నిహారిక-చైతన్యల వివాహంతో ఇటీవల మెగా వారింట్లో పెళ్లి బాజాలు మోగాయి. ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి త్వరలో మరో పెళ్లి కబురు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చిరు మేనల్లుడు సాయితేజ్ బయటపెట్టారు. వచ్చే ఏడాదిలో తమ కుటుంబంలో మరో వివాహం జరగొచ్చని అన్నారు.
త్వరలో మరో మెగా పెళ్లి కబురు.. అవును నిజమే! - saidharam tej marriage
వచ్చే ఏడాది మెగా పెళ్లి కబురు రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హీరో సాయితేజ్ వెల్లడించారు. తనకంటే అతడే పెద్దవాడని అన్నారు. ఇంతకీ ఆ కథానాయకుడు ఎవరంటే?
నిహారిక వివాహం తర్వాత సాయితేజ్ పెళ్లి చేసుకోనున్నారని.. పెళ్లికుమార్తె కూడా ఫిక్స్ అయ్యిందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ అవాస్తమని సాయితేజ్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి గురించి మరోసారి స్పందించారు. తనకంటే ముందు అల్లు శిరీష్ వివాహం జరగవచ్చన్నారు. 'శిరీష్ నాకంటే పెద్ద. తను వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకుంటాడు. ఇంటి పెద్దకొడుకుగా నా బాధ్యతలు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలి. పైగా పెళ్లి చేసుకోవడం కంటే సోలోగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. చిన్నప్పట్నుంచి ఎన్నో మిస్ అయ్యాను. చాలా కలలున్నాయి. ముందు వాటిని నెరవేర్చుకోవాలి' అని సమాధానం ఇచ్చారు.