అల్లు శిరీష్ ఒక బాలీవుడ్ ఆల్బమ్‌లో మెరిశారు. 'విలయాటి షరాబి' అంటూ సాగుతున్న పాటలో హేలీతో కలిసి ఆడిపాడారు. దర్శన్ రావల్, నీతి మోహన్ ఆలపించిన ఈ గీతానికి కుమ్మార్ లిరిక్స్ అందించారు. లిజో జార్జ్-డీజే స్వరాలు సమకూర్చారు.
బాలీవుడ్ మ్యూజిక్ వీడియోలో మెరిసిన అల్లు శిరీష్ - హిందీ పాట అల్లు శిరీష్
టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ మెరిసిన ఓ ప్రైవేట్ హిందీ ఆల్బమ్ విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటోంది. అది మీరూ చూసేయండి.

అల్లు శిరీష్
ఈ సాంగ్‌ను ట్విటర్‌లో షేర్ చేసిన శిరీష్ 'ఆనందకరమైన పార్టీ సాంగ్ విడుదలైంది. కచ్చితంగా హోలీ పార్టీలో మీరంతా ఈ సాంగ్‌కు చిందేస్తారు. ఈ మ్యూజిక్ వీడియోలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా'అంటూ రాసుకొచ్చారు. మరి లేటెందుకు ఆ సాంగ్‌ను మీరు చూసేయండి!