తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'క్రాసోవర్ స్టార్ ఆఫ్ ద ఇయర్'​గా శిరీష్ - tollywood

కొచ్చిలో జరుగుతున్న లులు ఫ్యాషన్ వీక్​లో 'క్రాసోవర్ స్టార్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకున్నాడు అల్లు శిరీష్. '1971' చిత్రంలో నటనకుగానూ పురస్కారం దక్కింది.

అల్లు శిరీష్

By

Published : Apr 29, 2019, 4:22 PM IST

అల్లు అరవింద్ తనయుడిగా టాలీవుడ్​కు పరిచయమైన హీరో అల్లు శిరీష్. 'గౌరవం'తో హీరోగా అరంగేట్రం చేశాడు. 'కొత్తజంట', 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్​లాల్​తో కలిసి '1971' చిత్రంలో నటించాడు.

అవార్డు అందుకుంటున్న అల్లు శిరీష్

'1971' సినిమాలోని నటనకుగానూ తాజాగా ఓ అవార్డు అందుకున్నాడు శిరీష్. కొచ్చిలో జరుగుతున్న లులు ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో 'క్రాసోవర్ స్టార్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం పొందాడు. ఓ తెలుగు నటుడికి ఈ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి.

ఇవీ చూడండి.. ఓటు కోసం క్యూ కట్టిన బాలీవుడ్...

ABOUT THE AUTHOR

...view details