దాదాపు 1000కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిన పద్మశ్రీ అల్లు రామలింగయ్య(allu ramalingaiah age).. ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించారు. శుక్రవారం(అక్టోబరు 1) ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య ప్రతిమను అల్లు స్టూడియోస్‌లో ఆయన మనవళ్లు అల్లు అర్జున్(allu arjun father), శిరీష్, బాబీ ఆవిష్కరించారు.
Allu ramalingaiah family: అల్లు రామలింగయ్య విగ్రహ ఆవిష్కరణ - మూవీ న్యూస్
టాలీవుడ్లో ఎన్నో వైవిధ్య పాత్రలతో మెప్పించిన అల్లు రామలింగయ్య(allu ramalingaiah age) వర్ధంతి సందర్భంగా అల్లు స్టూడియోలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన కుమారుడు అరవింద్ నిర్మాతగా రాణిస్తుండగా, మనవళ్లు హీరోలుగా చేస్తున్నారు.
అల్లు రామలింగయ్య వర్ధంతి
అల్లు రామలింగయ్య కుమారుడు అల్లు అరవింద్.. నిర్మాతగా పలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తు బిజీగా ఉన్నారు. ఈయన కుమారుల్లో అల్లు అర్జున్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. శిరీష్ కూడా కథానాయకుడిగా రాణిస్తున్నారు. బాబీ, మెగాహీరో వరుణ్‌తేజ్‌తో 'గని' సినిమా నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి: