తన కుమారుడు అల్లు అయాన్‌ను చూసి గర్వపడుతున్నానని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆనందం వ్యక్తం చేశాడు. తన కుమారుడి ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలను ఉద్దేశిస్తూ ఆదివారం ట్వీట్లు చేశాడు. ఈ విషయమై ఆ చిన్నారికి శుభాకాంక్షలు చెప్పాడు బాలీవుడ్ హీరో టైగర్‌ష్రాఫ్. అనంతరం స్పందించిన బన్నీ.. "థాంక్యూ బ్రదర్, నీ మెసేజ్ చూసి అయాన్ చాలా ఆనందపడుతున్నాడు" అని రాసుకొచ్చాడు.
అల్లు అయాన్‌కు విషెస్ చెప్పిన బాలీవుడ్ హీరో - movie news
అల్లు అర్జున్, తన కుమారుడు అయాన్ గురించి చేసిన ఓ పోస్ట్‌పై స్పందించాడు బాలీవుడ్ హీరో టైగర్‌ష్రాఫ్. శుభాకాంక్షలు అంటూ కామెంట్ చేశాడు.
అల్లు అర్జున్ కుమారుడు అయాన్
ఈ సంక్రాంతికి 'అల వైకుంఠపురములో' అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు బన్నీ. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఎర్రచందనం దొంగల నేపథ్య కథతో తీస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. గతంలో అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో 'ఆర్య', 'ఆర్య 2' సినిమాలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి.