తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప' సాంగ్​తో బన్నీ అదిరిపోయే రికార్డు - పుష్ప సాంగ్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప'(pushpa latest updates). ఈ సినిమాలోని ఓ లిరికల్​ సాంగ్​ను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం. 'సామి సామి' పేరుతో విడుదలైన ఈ సాంగ్​​ సౌత్​ ఇండియా రికార్డును కొల్లగొట్టింది.

pushpa
పుష్ప

By

Published : Oct 29, 2021, 10:13 PM IST

స్టార్ హీరో అల్లు అర్జున్, నటి రష్మికా మందాన జంటగా నటిస్తున్న 'పుష్ప'(pushpa latest updates) సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సుకుమార్(sukumar latest movie) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రంలోని పాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన 'సామి సామి' పాటకు(saami saami song pushpa) విశేష ఆదరణ లభిస్తోంది. ఈ పాటకు ఒక్క రోజులోనే ఏకంగా 10.2 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. దీంతో దక్షిణాదిలో ఒక్కరోజులోనే అత్యధిక వీక్షణలు సంపాదించిన సాంగ్​గా ఆల్​ టైమ్​ సౌత్​ ఇండియా రికార్డును కొల్లగొట్టింది.

ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి పార్ట్ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవి శ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మళయాల నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్​ పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బన్నీ కెరీర్​లో ఇది తొలి పాన్​ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథాంశం సాగనుంది.

ABOUT THE AUTHOR

...view details