అగ్ర కథానాయకుల చిత్రాలనగానే... అందులో ఏదో ఒక సన్నివేశం కోసం విదేశాలకు వెళ్లడమో, లేదంటే విదేశీ సాంకేతిక నిపుణుల సాయం తీసుకోవడమో పరిపాటి! ఆ మాటకొస్తే ఇటీవల మన సినిమాల్లో విదేశీ హంగులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ కొత్త చిత్రం 'పుష్ప' వంద శాతం మేకిన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రూపొందబోతోంది. మన దేశంలోని సినీ కార్మికులకి, సాంకేతిక నిపుణులకి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వందశాతం స్థానికంగానే చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
'పుష్ప' సినిమా ఫస్ట్‌లుక్ ఎంట్రీకి ఆరు కోట్లు
పాన్‌ఇండియా స్థాయిలో, ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రమిది. సుకుమార్ దర్శకుడిగా... మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. రష్మిక నాయిక. లాక్‌డౌన్ తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇందులో కథానాయకుడి పాత్ర పరిచయం నేపథ్యంలో ఆరు నిమిషాలపాటు సాగే యాక్షన్ ఘట్టం ఉంటుందట. ఆ సన్నివేశాల్ని రూ. 6 కోట్ల వ్యయంతో చిత్రీకరిస్తారని సమాచారం. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో, అల్లు అర్జున్..పుష్పరాజ్ అనే పాత్రలో తెరపై కనువిందు చేయనున్నారు.
ఇదీ చూడండి.. పవన్ వెండితెర శివతాండవం 'గబ్బర్‌సింగ్'కు ఎనిమిదేళ్లు