'పుష్ప' చిత్రీకరణ కోసం అడవుల్లోకి అడుగు పెట్టబోతున్నారు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్. నెల రోజులపాటు ఏకధాటిగా చిత్రీకరణలో బన్ని పాల్గొననున్నారు. అల్లుఅర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' తెరకెక్కనున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 6 నుంచి షురూ కాబోతోందని తెలుస్తోంది. అందుకోసం తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో సర్వం సన్నద్ధం చేస్తున్నారు.
నెల రోజుల షూటింగ్‌కు 'పుష్ప'రాజ్ పయనం
స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న కొత్త చిత్రం 'పుష్ప'. తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో నవంబరు 6 నుంచి ఈ సినిమా షూటింగ్ చేయనున్నారని సమాచారం. నెలరోజుల షెడ్యూల్లో కీలక సన్నివేశాలతో సహా ఓ పాటను తెరకెక్కించనున్నారని సమాచారం.
నెల రోజుల షూటింగ్‌కు 'పుష్ప'రాజ్ పయనం
ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథ ఇది. అల్లు అర్జున్ మాస్ పాత్రలో, పుష్పరాజ్ అనే యువకుడిగా కనిపించనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటించనున్నారు. ఈ సినిమా కోసం చిత్తూరు యాసలో వీరిద్దరూ తర్ఫీదు పొందారు. నెల రోజుల షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలతో పాటు పాటనూ తెరకెక్కిస్తారని సమాచారం.