Pushpa Part 2 Title: దేశవ్యాప్తంగా థియేటర్లలో అల్లు పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ పర్ఫార్మెన్స్కు తోడు సుకుమార్ టేకింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం ముందే వెల్లడించింది. శుక్రవారం విడుదలైన తొలి భాగం 'పుష్ప: ది రైజ్'కు ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించింది. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని సమంత ప్రత్యేక గీతానికి ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.