తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భోజ్​పురిలో రికార్డు బ్రేక్ చేసిన బన్నీ సినిమా - Allu Arjun pushpa

అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' భోజ్​పురి వెర్షన్ రికార్డు సృష్టించింది. ఆ భాషలో అత్యధిక ఇంప్రెసెన్స్​ పొందిన చిత్రంగా నిలిచింది.

Allu Arjun's DJ movie Breaks Bhojpuri TV Records
భోజ్​పురిలో రికార్డు బ్రేక్ చేసిన బన్నీ సినిమా

By

Published : Mar 20, 2021, 5:31 AM IST

అల్లు అర్జున్​ సినిమాలకున్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'అల వైకుంఠపురములో' చిత్రంతో, అందులో ఉన్న 'బుట్టబొమ్మ', 'రాములో రాముల' గీతాలతో పప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. గతంలో వచ్చిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో ఇప్పుడు మరో రికార్డు సాధించారు.

దువ్వాడ జగన్నాథం సినిమాలో అల్లు అర్జున్

ఈ చిత్రం భోజ్​పురి వెర్షన్, డించక్​ టీవీలో ఇటీవల ప్రసారమవగా.. 39.83 లక్షల ఇంప్రెసెన్స్ సొంతం చేసుకుంది. ఆ భాషలో ఇప్పటివరకు ప్రసారమైన సినిమాల ఇంప్రెసెన్స్​లో ఇదే అత్యధికం.

ఇదే విషయాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 'దువ్వాడ జగన్నాథం' హిందీ వెర్షన్​ యూట్యూబ్​లో దుమ్ములేపుతోంది. ఇప్పటికే 326 మిలియన్ల పైచిలుకు వ్యూస్ తెచ్చుకుంది.

ABOUT THE AUTHOR

...view details