ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం 'పుష్ప' సినిమాతో బిజీగా ఉన్నారు. మరోవైపు అతడి వారసురాలు వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది! అవును.. బన్నీ కుమార్తె అర్హ తో ఓ సినిమా తీసేందుకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం!
ఓ చిన్నారి నేపథ్యంగా నడిచే కథతో ఓ సినిమా చేయాలని ప్రముఖ నిర్మాత దిల్రాజు భావిస్తున్నారు. సురేశ్ అనే కొత్త దర్శకుడి దీనిని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర కోసం అల్లు అర్హను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.