తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అల వైకుంఠపురములో' కలెక్షన్లు, లైక్​ల జోరు - Allu Arjun's Ala 'Vaikunthapurramuloo' Dominates Darbar And Baahubali 2

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో'. పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా... బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ మూవీ కలెక్షన్లతో పాటు యూట్యూబ్​ లైక్స్​లోనూ ఓ రికార్డు అందుకుంది.

Allu Arjun's Ala Vaikunthapuramuloo's Record-breaking Win At The International Box Office
'అల వైకుంఠపురములో' కలెక్షన్లు, లైక్​ల జోరు

By

Published : Jan 17, 2020, 11:44 AM IST

టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన 'అల.. వైకుంఠపురములో..' సినిమా నాన్‌ బాహుబలి-2 రికార్డ్స్‌ను సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం.. సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. బన్నీ నటన, డ్యాన్స్‌లతో యాక్షన్‌ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అయిపోగా.. త్రివిక్రమ్‌ తన మార్క్‌ డైలాగ్స్‌, స్క్రీన్​ ప్లేతో మెప్పించాడు.

కలెక్షన్లు అదుర్స్​...

'అల వైకుంఠపురములో..' సినిమా కలెక్షన్లలోనూ జోరు చూపిస్తోంది. నైజాం, వైజాగ్, కృష్ణ , వెస్ట్, సీడెడ్, గుంటూరు, నెల్లూరు ఏరియాల్లో బాహబలి-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ ఏడాది ఓవర్సీస్‌లో విడుదలైన చిత్రాల్లో... బన్నీ సినిమా నంబర్ 1 స్థానంలో దూసుకెళ్తోంది.

లైక్స్​లోనూ...

యూట్యూబ్‌లో మిలియన్‌కు పైగా లైక్స్ సాధించి సత్తా చాటింది 'రాములో రాములో' పాట. 146 మిలియన్ల (14 కోట్ల 60 లక్షల)కు పైగా వ్యూస్‌ సాధించిన ఈ పాటకు పది లక్షలకు పైగా లైక్స్ రావటం విశేషం. పార్టీ మూడ్‌లో సాగే ఈ పాటలో బన్నీ వేసిన హాఫ్‌ కోట్‌ స్టెప్‌ (దోశ స్టెప్‌) కూడా చాలా ఫేమస్‌ అయ్యింది.

ABOUT THE AUTHOR

...view details