అల్లు అర్జున్ కొత్త సినిమా అల.. వైకుంఠపురములో. ఇప్పటికే ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్లు విడుదల చేసి సినిమాపై ఆసక్తి పెంచుతోంది చిత్రబృందం. తాజాగా ఓ ప్రచార గీతాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. దసరా కానుకగా ఈ సినిమాలోని ఓ పాటను మేకింగ్ వీడియో రూపంలో విడుదల చేయనున్నారట.
ఆ పాట పాడిన విధానం, ఇందుకోసం రూపొందిస్తున్న సెట్స్ నేపథ్యంలో ఈ వీడియో ఉండబోతోంది. తమన్ స్వరపరచిన ఈ గీతాన్ని సిద్ధ్ శ్రీరామ్ ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు.