హీరో అల్లు అర్జున్ కూతురు అర్హా చెప్పిన ఓ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. డాటర్స్ డే(కుమార్తెల దినోత్సవం) సందర్భంగా 'అల వైకుంఠపురములో' సినిమా డైలాగ్‌ను అర్హాతో చెప్పించి.. ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు బన్నీ. ముద్దు ముద్దు హావభావాలతో అర్హా చెప్పిన ఈ డైలాగ్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
"ఈ ప్రపంచంలో అందరికంటే కుమార్తెలు అందమైన వ్యక్తులు. ప్రపంచంలోని కూతుర్లందరికీ డాటర్స్ డే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నా చిన్నారితో రూపొందించిన ఓ వీడియోను షేర్ చేస్తున్నా." -అల్లు అర్జున్, నటుడు