ఈరోజు అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రైవేట్ పార్టీలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు మాత్రమే పాల్గొన్నారు. బన్నీ తన జీవిత భాగస్వామిని విష్ చేశారు. ఈ పార్టీలో తీసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. స్నేహ తన శ్రేయోభిలాషులతో కలిసి దిగిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తివి నీవు: బన్నీ - స్నేహా రెడ్డి పుట్టినరోజు
అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా బన్నీ ఆమెకు విష్ చేస్తూ ఓ ఫొటో షేర్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారింది.
భార్య కేక్ కట్ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.."నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి నీవు. ఇలాంటి పుట్టినరోజుల్ని మరెన్నో జరుపుకోవాలి. మరెన్నో పుట్టినరోజు వేడుకలకు నేను ఇలానే నీ పక్కనుండాలని కోరుకుంటున్నా. జన్మదిన శుభాకాంక్షలు క్యూటీ" అని బన్నీ పోస్ట్ చేశారు.
టాలీవుడ్ అందమైన జంటల్లో బన్నీ-స్నేహ ఒకరు. 2011లో వీరి వివాహం జరిగింది. ఇద్దరి ప్రేమకు చిహ్నంగా అయాన్, అర్హా జన్మించారు. స్నేహ అమెరికాలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఆ సమయంలో ఓ పెళ్లికి హాజరైన ఆమెను బన్నీ చూశారు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి, అది ప్రేమగా మారింది.