తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టబుకు రూ.4కోట్లు... బన్నీకి రూ.1 కోటి....!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ కాంబినేషన్​లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్ర విశేషాలు ప్రస్తుతం అందరిలో హాట్​టాపిక్​గా మారాయి.

By

Published : Aug 11, 2019, 5:56 PM IST

Updated : Sep 26, 2019, 4:17 PM IST

అల్లు అర్జున్​, టబు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్​ అల్లు అర్జున్​, పూజాహెగ్డే జంటగా సినిమా రూపొందుతోంది. ఇందులో యువ హీరో సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, సీనియర్‌ హీరోయిన్‌ టబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలోని టబు పాత్ర కోసం అన్నపూర్ణ స్టూడియోలో రూ. 4 కోట్లతో ఖరీదైన బంగ్లా సెట్​ వేయనున్నారట. కథానాయకుడు బన్నీకి మాత్రం రూ.1 కోటితో నిర్మిస్తున్నారని సమాచారం.

ఈ చిత్రంలో టబు ధనవంతురాలిగా కనిపించనుందని.. అందుకే ఖరీదైన బంగ్లా నిర్మిస్తున్నట్లు సమాచారం​. ఈ ఇంటిని త్రివిక్రమ్ తన ఇష్టప్రకారం విదేశీ హంగులతో తీర్చదిద్దనున్నాడట.
హైదరాబాద్​లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేస్తోన్న బన్నీ ఇంటి సెట్​.. ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందట. ఇందుకు స్టైలిష్ ఫర్నిచర్, తంజావూరు నుంచి తెప్పించిన దేవుళ్ల విగ్రహాల కోసం రూ. 30 లక్షల వరకు ఖర్చు పెట్టనున్నాడు త్రివిక్రమ్.

ఇంతకు ముందు అరవింద సమేత, అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది సినిమాల కోసం భారీ ఇళ్ల సెట్లు రూపొందించాడు. శరవేగంగా చిత్రీకరణ జరపుకొంటోన్న అల్లు అర్జున్ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఆగస్ట్​ 15న విడుదల చేయనున్నారట. 2020 సంక్రాతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

ఇదీ చూడండి: 'ఒక్క సినిమాతోనే జీవితం సెటిలైపోయింది'

Last Updated : Sep 26, 2019, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details